మెట్‌పల్లిలో అడ్మిషన్లు.. కరీంనగర్​లో క్లాసులు

  •     జ్యోతిబాపూలే ఇంటర్‌‌ ‌‌స్టూడెంట్స్‌‌ కు గంగాధర, ఎల్​ఎండీ స్కూళ్లలో పాఠాలు

మెట్‌‌ ప్లలి, వెలుగు: మెట్‌‌పల్లిలోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌‌  స్కూల్‌‌ కు ఇంటర్‌‌ ‌ అడ్మిషన్లు ఇక్కడ జరుగుతుండగా క్లాసులు మాత్రం కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. 2017లో మెట్‌‌ పల్లి మండలంలోని మెట్లచిట్టాపూర్‌‌ ‌‌  గ్రామానికి జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌‌  స్కూల్‌‌  మంజూరైంది. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో మెట్‌‌ పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట్‌‌ లో ఓ ప్రైవేటు బిల్డింగ్ అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. 

ఈ స్కూల్ లో 2021లో ఇంటర్మీడియట్ ప్రారంభించారు. స్కూల్‌‌ లో ఇంటర్​ నిర్వహణకు సరిపడా మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్న యాజమాన్యం.. క్లాసులు మాత్రం కరీంనగర్ జిల్లాలో చెప్పిస్తోంది. ఎంపీసీ, బైపీసీ వారికి కరీంనగర్ జిల్లా గంగాధర స్కూల్‌‌ లో, సీఈసీ వారికి ఎల్ఏండీ స్కూల్‌‌ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. 

దీంతో దూరభారంతో మూడేండ్లుగా స్టూడెంట్స్‌‌  అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్సీవో గౌతమ్ రెడ్డి ని వివరణ కోరగా మెట్ల చిట్టాపూర్ స్కూల్ లో ఇంటర్ క్లాసుల నిర్వహణకు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేకపోవడంతో కరీంనగర్​ జిల్లాకు పంపిస్తున్నట్లు చెప్పారు.