నిజామాబాద్లో చిరుత మళ్లీ కనిపించింది

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ (ఎం) గ్రామంలో కొన్ని రోజులుగా చిరుత గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం సాయంత్రం మళ్లీ గ్రామ శివారులో రాళ్లపై కూర్చొని కనిపించింది. ఈ దృశ్యాన్ని గ్రామస్తులతు సెల్​ ఫోన్​లో బంధించారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతని బంధించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.