Health Alert : చిన్న వయస్సులోనే కాళ్లు, కీళ్ల నొప్పులు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

ప్రమాదం చిన్నదే. దెబ్బలు కూడా పెద్దగా తగల్లేదు. కానీ, కాలు విరిగి మంచం పట్టాడు. మా అబ్బాయి స్కూలు నుంచి ఇంటికి రాగానే చేతులు, కాళ్లు గుంజుతున్నాయని ఏడుస్తున్నాడు. ఇలా చాలా మంది చెప్తుంటారు. అయితే.. దీనంతటికి కారణం ఎముకల్లో పటుత్వం లేకపోవడమే. అరవై ఏళ్ల వయసులో కీళ్ల నొప్పులతో బాధపడడం కామనే. కానీ అదే సమస్య పదేళ్ల వయసులోనూ ఎందుకొస్తుంది?

ఆధునిక ప్రపంచంలో చాలా మందికి శారీరక శ్రమ తగ్గింది. అన్ని ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్నీ వసతులు సమకూరుతున్నాయి. దీంతో శ్రమ తగ్గడంతో శరీరానికి వ్యాయామం కరువైంది. అందుకే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసు లోనే బీపీ, షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు పెరుగుతున్నారు.

అయితే ఇప్పుడు వాటితోపాటు ఆల్గో సమస్యలు మరింత వేధిస్తున్నాయి. ఈ మధ్య సమస్యలతో బాధపడేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. సరైన పోషకాహారం తీసుకో కపోవడం, ఉదయం బయటకు వెళ్లకపోవడంతో శరీరంపై సూర్యరశ్మి పడకపోవడం, శారీరక శ్రమ తగ్గడం.. వల్లనే చిన్నా పెద్ద, ఆడా మగా అనే తేడా లేకుండా అందరికీ సమస్యలు వస్తున్నాయని డాకర్టర్లు అంటున్నారు. 

20శాతం పెరిగిన ఆ సమస్యలు..

పదిహేనేళ్లలో ఆర్థో సమస్యలతో బాధపడే వాళ్ల సంఖ్య 20శాతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలామందికి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు యాభై ఏళ్లు పైబడిన వాళ్లలో 90-95 శాతం మంది, 12 సంవత్సరాల్లోపు చిన్నారులు. 15 శాతం మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.

శారీరక శ్రమ లేకపోవడంతో...

రోజువారి శారీరక శ్రమ లేకపోవడం వల్లనే ఎముకల సమస్యలు పెరుగుతున్నాయి. చిన్నారులు నిద్ర లేవగానే హడా విడిగా తయారై ఆటోలోనో, బస్సులోనో స్కూలుకు వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చింది మొదలు టీవీ చూస్తూనో.. మొబైల్ లో గేమ్స్ ఆడుతూనో గడిపేస్తారు. వాళ్లకు వ్యాయామం ఉండదు. ఇక పెద్దలంతా ఆఫీసుల్లో, వయసు పైబడిన వాళ్లు ఇంట్లోనే తమ పూర్తి సమయాని గడుపుతున్నారు.

ఎముకల గట్టిదనానికి కావాల్సిన శారీరక శ్రమ ఉండదు. దీనివల్ల  ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. అలస్యంగా నిద్రలేచి ఆఫీసుకు పరుగులు తీస్తారు. పది నిమిషాలు కూడా ఎండలో ఉండరు. కాబట్టి శరీరానికి డి విటమిన్ అందక ఎముకలు పెళుసుబారుతున్నాయి. అందుకే చిన్న ప్రమాదానికే పెద్ద డ్యామేజ్.

అహారపు అలవాట్లు కారణమే..

అహారపు అలవాట్లు కూడా ఆర్థో సమస్యలు పెరగడానికి ప్రధాన కారణమని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు పండించేందుకు రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు. వాటినే మనం తింటున్నాం. అంతేకాక చాలామంది పూర్తి స్థాయిలో పాలిష్ చేసిన ఆహార ధాన్యాలను తింటున్నారు. దాంతో ఎము కలకు కావాల్సిన పోషకాలు అందడం లేదు. ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. 

దీర్ఘకాలిక వ్యాధులతో..

ఇప్పటికే బీపీ, ఘగర్ లాంటి దీర్ఘకాల వ్యాధులతో సతమతమవుతున్న జవాలను ఆర్థో సమస్యలు మరింత వేధిస్తున్నారు. డయాబెటిక్ పేఫేంట్స్.. హైబీపీ, లోబీపీలో బాధపడే వాళ్లకు కీళ్లపై ఒత్తిడి పెరిగి కండరాలు, ఎముకల సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు అధిక బరువు ఉన్నవాళ్లకు మెకాళ్ల నొప్పుల మరింత పెరుగుతున్నాయి.