ఆర్మూర్ టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ లో చేరాలని కోరుతూ ఆదివారం కాలేజ్ లెక్చరర్లు మండలంలోని ఫతేపూర్ కోమన్ పల్లి  గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

 పదోతరగతి లో పాస్ అయిన స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులను కలిసి జూనియర్ కాలేజీలో ఉన్న వసతులు సౌకర్యాలను వివరించి కాలేజీలో చేరాలని ప్రచారం చేశారు. ప్రిన్సిపల్ నర్సయ్య, లెక్చరర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.