JBL Live Beam 3 Earbuds:ఛార్జింగ్‌ కేస్‌,టచ్‌స్క్రీన్‌తో ప్రముఖ కంపెనీ ఇయర్‌బడ్స్‌..40 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌..

JBL Live Beam 3 Earbuds: ప్రముఖ ఆడియో ప్రాడక్ట్స్ తయారీ సంస్థం అయిన JBL ఇండియా మార్కెట్లో తన ప్రాడక్టులను క్రమంగా విస్తరిస్తోంది.  తాజాగా JBLలైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ స్మార్ట్ ఛార్జింగ్ కేస్ తో అందుబాటులోకి వస్తోంది. ఈ ఛార్జింగ్ కేసు 1.45 అంగుళా టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 40 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. 

JBL Live Beam 3 Earbuds ప్రత్యేకతలు: 

JBL లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ 10 mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC), ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో మెరుగైన సర్వీస్ ను అందిస్తుంది. స్మార్ట్ యాంబియంట్ సౌండ్ మోడ్ ను కూడా కలిగి ఉంటుంది. JBL స్పెషియల్  సౌండ్ టెక్నాలజీకి సపోర్టు చేస్తుంది. 

ఈ ఇయర్‌బడ్స్‌ స్మార్ట్ ఛార్జింగ్ కేస్‌ లో  1.45 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ను కలిగి ఉంది. సెట్టింగ్స్‌ మార్చుకోవడం సహా వాల్యూమ్ నియంత్రించవచ్చు. బ్లూటూత్ మల్టీ పాయింట్‌ కనెక్టివిటీని సపోర్టు, IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ (వాటర్‌ ఫ్రూఫ్‌) గా ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌ తో 36 గంటల ప్లేబ్యాక్‌ టైం ఉంటుంది. ఈ ఇయర్‌ బడ్స్‌లో ఒక్కో బడ్‌ 68mAh బ్యాటరీ, ఛార్జింగ్ ఛార్జింగ్ కేస్‌ 680mAh బ్యాటరీతో వస్తుంది. ANC ఆఫ్‌ చేసినప్పుడు 10 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

ANC, ట్రూ ANC ఆన్‌లో ఉన్నప్పుడు 9 గంటల ప్లే బ్యాక్‌ టైంను పొందవచ్చు. ఛార్జింగ్‌ కేస్‌ ద్వారా అయితే 36 గంటలపాటు ప్లే బ్యాక్‌ టైం లభిస్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి 2 గంటల సమయం తీసుకుంటుంది. 

JBL లైవ్‌ బీమ్ 3 ధర, సేల్‌ వివరాలు : 

JBL లైవ్‌ బీమ్ 3 ధర రూ.24,999. యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 10 శాతం డిస్కౌంట్‌, అమెజాన్‌లో ఇయర్‌బడ్స్ ధర రూ.13,999 గా ఉంది. జూన్‌ 21 సేల్ ప్రారంభం అవుతుంది. JBL వెబ్‌సైట్‌ సహా ఇతర ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలలో కొనుగోలు చేయవచ్చు. బ్లూ, సిల్వర్‌, బ్లాక్‌ రంగుల్లో ఈ ఇయర్ బడ్స్ లభిస్తాయి.