మాక్లూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం గెజిటెడ్ హెడ్ మాస్టర్స్సంఘం సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆదివారం సీఎం క్యాంప్‌ఆఫీస్‌లో సీఎంను కలిసి 2016లో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విద్యాశాఖను పునర్వ్యవస్థీకరించక పోవటంతో స్కూల్ ఎడ్యుకేషన్ విధ్వంసానికి గురైందన్నారు. రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ఎడ్యుకేషన్ డివిజన్లను రీ ఆర్గనైజ్చేయాలని, పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు.
కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్, ప్రిన్స్పాల్సెక్రటరీ బి.వెంకటేశం, కమిషనర్ఆఫ్స్కూల్స్ఎడ్యుకేషన్ ఏ. దేవసేన, గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి, కోశాధికారి బి. తుకారాం ఉన్నారు.