- బీసీ జేఏసీ నేతలు
మిర్యాలగూడ, వెలుగు : రాజ్యాధికారమే లక్ష్యంగా మిర్యాలగూడ లో జరిగే బీసీ గర్జన వేదికగా ఉద్యమిద్దామని బీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. నవంబర్ 3న మిర్యాలగూడలో జరగనున్న బీసీ గర్జన బహిరంగ సభ ప్రచార రధాలను శనివారం స్థానిక మహాత్మా జ్యోతిభా పూలే భవన్ ఆవరణ లో ప్రారంభించారు. అనంతరం బీసీ రాజకీయ చైతన్య వేదిక కో కన్వీనర్ తమ్మడు బోయిన అర్జున్ అధ్యక్షతన బీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, కో కన్వీనర్ కోల సైదులు, అర్జున్, తిరుమలగిరి అశోక్, మాట్లాడారు. దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీ లకు వాటా దక్కాలన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆర్.కృష్ణయ్య, నేతి విద్యాసాగర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఏ ఎస్ చిరంజీవులు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోడెపాక కుమారస్వామి, ముత్యం వెంకన్న గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్ హాజరు కానున్నారని చెప్పారు. ఈ సమావేశంలో దాసరాజు జయరాజు, సింగు రాంబాబు సింగ్ కృష్ణ, , మహేశ్ గౌడ్, పున్న రాములు, ఈశ్వర చారి, పిన్న బోయిన శ్రీనివాస్ ఉన్నారు.