డిప్యూటీ సీఎంను కలిసిన నాయకులు

హుజూర్ నగర్, వెలుగు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం హైదరాబాద్​లోని ప్రగతి భవన్ లో జాతీయ ఐఎన్ టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, నాగన్నగౌడ్, చంద్రశేఖర్, భూపాల్ రెడ్డి సురేశ్ కలిశారు. 

పెండింగ్ లో ఉన్న  సమస్యలు, విద్యుత్ ఆర్టిజన్స్ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు.