కాంగ్రెస్‌‌‌‌లో చేరికలు

ఎల్లారెడ్డి, వెలుగు : వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎల్లారెడ్డి పార్టీ  కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు. ఎల్లారెడ్డి మండలం మత్తమల్ గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సొసైటీ వైస్  ప్రెసిడెంట్ పద్మారావు, కోకొండ గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు రామానంద్,  మత్తమల్ గ్రామ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  పార్టీ నాయకులు ఎమ్మెల్యే  మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో  చేరారు.

పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఎంపీ ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ ఉషా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల  ప్రెసిడెంట్ సాయి బాబా పాల్గొన్నారు.