ఇంటిని అందంగా డెకరేట్ చేయడం అందరికీ ఇష్టమే. అయితే పండుగలప్పుడు మరింత స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. అందుకోసం కొత్తగా, క్రియేటివ్‌గా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లకోసమే ఈ ట్రెడిషనల్ డెకరేటివ్ పీస్. సంక్రాంతికి ఎడ్ల బండి డెకరేటివ్ పీస్‌లా పెడితే పండుగ కళ వచ్చేస్తుంది. రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది.
ఈ డెకరేటివ్ ఐటమ్ ఇత్తడితో తయారుచేసింది. కాబట్టి ఎక్కువకాలం ఉంటుంది. చూడటానికి ముచ్చటగా ఉండే ఈ బొమ్మ చేత్తో తయారచేశారు. ఆఫీస్, హోటల్, టెంపుల్స్ వంటి వాటి చోట్ల ఈ డెకరేటివ్ పీస్ పెట్టుకోవచ్చు. గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. అయితే దీన్ని నీళ్లతో కడగకూడదు. పొడిగా ఉండే కాటన్ క్లాత్‌తో మాత్రమే క్లీన్ చేయాలి.
ధర : 665 రూపాయలు
లైఫ్ టైం క్యాలెండర్
ఇంట్లో లేదా ఆఫీస్‌లో టేబుల్ మీద డెకరేషన్ పీస్ కోసం లైఫ్ టైం క్యాలెండర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో రోజులు, తేదీలు, వారాలు అన్నీ ఉంటాయి. వాటిని ఈజీగా రొటేట్ చేయొచ్చు. వాటితో స్పెషల్ డేట్స్ సెట్ చేసుకోవచ్చు. దానికి అటాచ్ అయిన స్టాండ్స్‌లో పెన్నులు, ఫొటోలు పెట్టుకోవచ్చు. క్యాలెండర్‌ని ప్రతి ఏటా మారుస్తుంటాం.
కానీ, ఈ క్యాలెండర్ ఎన్నేండ్లయినా వాడుకోవచ్చు. అందుకే దీన్ని ‘లైఫ్ టైం క్యాలెండర్’ అంటారు. ఇది డెకరేటివ్ పీస్లానే కాకుండా బర్త్‌డే, మ్యారేజ్ డే వంటి స్పెషల్ డేస్‌కి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. చూడటానికి కూడా స్మార్ట్, స్టయిలిష్‌గా ఉండే యాంటిక్ పీస్ ఇది. చెక్కతో తయారుచేసింది. కాబట్టి చాలా రోజులు పాడవ్వదు. బరువు కూడా ఎక్కువగా ఉండదు.
ధర : 649 రూపాయలు
ధూప్ హోల్డర్
గోల్డెన్ మెటల్ కలర్లో ఉన్న ఈ హోల్డర్ పాతకాలంనాటి రోజుల్ని గుర్తుచేస్తుంది. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. పూజ చేసినప్పుడల్లా ధూపం వేయడానికి ప్రతి సారీ కొత్త హోల్డర్స్ వాడాల్సిన అవసరం రాదు. ఇందులో ధూఫ్ స్టిక్స్ , కొవ్వొత్తులు కూడా పెట్టొచ్చు. చూడటానికి ఆర్టిస్టిక్‌గా కనిపించే ఈ హోల్డర్ని గోడకు తగిలించేయొచ్చు. హై క్వాలిటీ మెటల్‌తో దీన్ని తయారుచేశారు. ఎక్కువకాలం పనిచేస్తుంది. క్లీన్ చేయడం చాలా ఈజీ.
ధర : 1299 రూపాయలు
క్యాసెట్ పెన్ స్టాండ్
ప్రస్తుతం మార్కెట్లో రెట్రో ఐటమ్స్‌కి గిరాకీ బాగా ఉంది. ఈ పెన్ స్టాండ్‌లా రెట్రో ఐటమ్స్ కొత్త లుక్‌లో వస్తున్నాయి. అందుకే వాటికి అంత క్రేజ్ ఉంటోంది. పాతకాలంలో ఉండే క్యాసెట్‌ను పోలిన పెన్ స్టాండ్. ఇందులో 30 పెన్నులు లేదా పెన్సిల్స్ పెట్టుకోవచ్చు. ఇందులో రీల్ బదులు టేప్ ఉంటుంది. అంతేకాకుండా చిన్న స్టేషనరీ ఐటమ్స్ కోసం స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. టేప్ అయిపోయాక కొత్తది పెట్టొచ్చు. అయిపోయిన టేప్ తీసేందుకు పైన నొక్కితే చాలు కిందకి వచ్చేస్తుంది. కింద నుంచి టేప్ తీసేయొచ్చు.
ధర : 494 రూపాయలు