టెక్నాలజీ  : వాట్సాప్​లో ఏఆర్​ ఫీచర్

పర్సనల్ లేదా వర్క్ కోసం రెగ్యులర్​గా వాట్సాప్ ఉపయోగించేవాళ్లకు బాగా పనికొచ్చే ఫీచర్​ ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ). 
ఈ ఫీచర్​ని వాట్సాప్​ త్వరలోనే తేబోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ బీటా వెర్షన్ 2.24.13.14లో ఈ విషయాన్ని చెప్పింది. 

వాట్సాప్‌‌లో కొత్త ఏఆర్ ఎఫెక్ట్‌‌లు, ఫిల్టర్స్​తో ఎక్స్​పరిమెంట్స్​ చేస్తోంది. ఈ ఏఆర్ ఎఫెక్ట్‌‌లు డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్స్​ను యాడ్ చేయడం ద్వారా వాళ్ల వీడియో కాల్స్​ను కస్టమైజ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఉదాహరణకు.. టచ్-అప్ టూల్​తో తక్కువ కాంతిలోనూ వ్యూ ఎక్స్‌‌పీరియన్స్ ఇస్తుంది. వాట్సాప్ కాల్‌‌ మాట్లాడేటప్పుడు యూజర్లు వాళ్ల బ్యాక్‌‌గ్రౌండ్‌‌ని ఎడిట్ చేసేలా ఫీచర్‌‌ను డెవలప్​ చేస్తోంది.


 ముఖ్యంగా ఇది గ్రూప్ కాన్ఫరెన్స్‌‌లకు బాగా పనికొస్తుంది. అప్పుడు యూజర్లు తమకు అవసరమైన వాటిని ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ బ్యాక్‌‌గ్రౌండ్ ఎడిటింగ్ ఫీచర్ భవిష్యత్తులో డెస్క్‌‌టాప్ యాప్స్​లో కూడా అందుబాటులోకి రానుంది. వాట్సాప్ కాల్‌‌ చేసేటప్పుడు ప్రొఫెషనల్ సెట్టింగ్స్​ లేదా డీటెయిల్డ్ బ్యాక్‌‌గ్రౌండ్ అడ్జెస్ట్ ఆప్షన్​ బాగా ఉపయోగపడుతుంది.

వాట్సాప్‌‌లో ఈ ఫీచర్స్​తో పాటు, వీడియో కాల్స్​ను మరింత అట్రాక్టివ్​గా మార్చుతుంది. వాట్సాప్ కాల్‌‌ చేసేటప్పుడు క్రియేటివిటీతో పాటు ఈ ఫీచర్ ప్రైవసీ పరంగా యూజర్లను అనుమతిస్తుంది. కాల్ ఎఫెక్ట్స్​, ఫిల్టర్స్​కు  వాట్సాప్ ఏఆర్ ఫీచర్​ని ఇంకా డెవలప్ చేసే దశలో ఉంది.