ప్రతి రోజూ ఏదో ఒక అవసరం కోసం ఎన్నో వెబ్ సైట్స్ వాడాల్సి వస్తుంది. ప్రస్తుతం నకిలీ వెబ్ సైట్స్ ఎక్కువైపోయాయి. వాటివల్ల యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నకిలీ వెబ్సైట్లను కనిపెట్టడమే. అదెలాగంటే..
వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే.. ముందుగా ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాలి. వెబ్సైట్ పేరు చివర్లో.. com, org, in, edu లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే నకిలీ వెబ్సైట్ల డొమైన్ పేర్లు అలాకాకుండా తప్పుగా ఉంటాయి.
వెబ్సైట్ పేరులో URL ఉంటే కచ్చితంగా దానికి ముందు http ఉంటుంది. అలా ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్. అలాలేదంటే నకిలీ.
వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ అవుతుంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్.
ఒరిజినల్ వెబ్‌సైట్స్‌లో about us, contact పేజీలు కనిపిస్తాయి. నకిలీ వెబ్సైట్లలో ఆ వివరాలు ఉండవు.
అంతేకాకుండా web of trust అనే వెబ్సైట్ వాడి నకిలీ వెబ్సైట్లను గుర్తించొచ్చు.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్, రెడ్ మార్క్ ఉంటే నకిలీ వెబ్సైట్.
అనుమానాస్పద లింక్‌లు, ఫోన్ నెంబర్లతో వచ్చే మెసేజ్‌ల గురించి కంప్లయింట్ చేసేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) 8712672222 వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచింది. అలాంటి లింక్స్ ఏవైనా వస్తే వాటిని ఈ నెంబర్‌కు పంపిస్తే వాటిని పరిశీలిస్తుంది. నకిలీవని తేలితే వాటిని పనిచేయకుండా చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.