డాక్యుమెంట్స్ షేరింగ్ ఈజీ
వాట్సాప్ డాక్యుమెంట్ ఫైల్స్ షేర్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ కాబోతుంది. అందుకోసం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తోంది. మెసేజింగ్ యాప్ త్వరలో డాక్యుమెంట్ ప్రివ్యూలను అందించనుంది. అంటే.. వాట్సాప్‌లో డాక్యుమెంట్ షేర్ చేసినప్పుడు.. అది ఓపెన్ చేయడానికి ప్రివ్యూ ఫొటో చూడొచ్చు ఇకమీదట. ఈ ఫీచర్ వల్ల చాట్‌లో అవసరమైన డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేసినప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
డౌన్‌లోడ్ చేయక్కర్లేదు
ప్రస్తుతం, వాట్సాప్‌లో ఒక ఫొటో లేదా వీడియోని డాక్యుమెంట్‌గా షేర్ చేస్తే.. డౌన్‌లోడ్ చేస్తేనే దాన్ని చూసే అవకాశం ఉంటుంది. కానీ, రాబోయే ఈ ఫీచర్‌తో ఆ సమస్య ఉండదు. ప్రివ్యూ ద్వారా పంపిన డాక్యుమెంట్‌లోని కంటెంట్ డౌన్‌లోడ్ చేయకుండానే చూడొచ్చు. అంతేకాదు.. వాట్సాప్ చాట్ చేసే కాంటాక్టులను చూపించే ఫీచర్ మీద కూడా పనిచేస్తోందట. ప్రస్తుతానికి ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. చాట్ లిస్టులో కింది భాగాన ఉంటుంది. ఈ ఫీచర్ ఉంటే యూజర్లు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొత్త చాట్ చేయొచ్చు. కొత్త చాట్‌అవసరం లేదనుకుంటే ఆ చాట్ లిస్ట్ కింద ఉన్న స్పెషల్ సెక్షన్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ వాట్సాప్ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
యాక్టివ్‌గా ఎవరు ఉన్నారు?
వాట్సాప్‌లో మరో ఫీచర్ వచ్చేసింది. ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో చూడాలన్నా, టెక్స్ట్ లకు రిప్లయ్ ఇవ్వాలన్నా ఈ ఫీచర్ పనికొస్తుంది. ముందుగా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయగలరో చెక్ చేయాలనుకున్నా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వల్ల ప్రతి కాంటాక్ట్ యాక్టివిటీ స్టేటస్ పర్సనల్‌గా చెక్ చేసే పని లేదు. దీనివల్ల యూజర్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది. ఈ ఫీచర్ చాట్ లిస్ట్ కింద ఉంటుంది. ప్రస్తుతానికి, బీటా టెస్టర్ గ్రూప్‌కి ఈ కొత్త ఫీచర్ వచ్చింది. రాబోయే వారాల్లో యూజర్లందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటు లోకి వస్తుందట! చాట్ డిస్టర్బెన్స్ లేకుండా కొత్త చాట్ డిఫాల్ట్‌గా యాక్సెస్ చేస్తుంది. చాట్ నోటిఫికేషన్స్ వద్దనే యూజర్లు వాటిని స్టాప్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి.
వాట్సాప్.. ఇన్‌స్టాలో.. ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఈ మధ్య ఎక్కడ చూసిన ఇదే చర్చ. వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ను నేరుగా సెర్చ్ బార్ సెక్షన్‌లో ఇంటిగ్రేట్ చేసేసింది . స్టేబుల్ వెర్షన్‌లో యూజర్లు మెటా ఏఐ చాట్‌బాట్ సాయంతో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఏఐ చాట్ బాట్ కూడా చాట్జీపీటీలానే పనిచేస్తుంది. ఈ చాట్‌బాట్‌ని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్ చేశాక యూజర్లకు ఈ ఏఐ చాట్‌బాట్ యాక్సెస్ ఇస్తుంది.
వాట్సాప్‌లో..
చాట్‌బాట్‌కు రీ–డైరెక్ట్ అయితే తప్ప యూజర్ల ప్రశ్నలు మెటా ఏఐతో షేర్ కావు. సెర్చ్ బార్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ని ఇంటిగ్రేట్ చేసినప్పటికీ పాతదానిలో వర్క్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు, మెటా ఏఐ చాట్‌బాట్ ద్వారా యూజర్ల ప్రశ్నలను క్లియర్ చేసేందుకు ఈ బార్ వాడొచ్చు. సెర్చ్ బార్‌లోని కమ్యూనికేషన్ డాటా సీక్రెట్‌గా ఉంటుంది. పర్సనల్ మెసేజ్‌లు, కాల్ ప్రైవసీతో పాటు ఎండ్-–టు-–ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది.
వాట్సాప్ లేదా మెటా ఏవీ యూజర్ కమ్యూనికేషన్‌లను యాక్సెస్ చేయలేరు. ప్రస్తుతం లిమిటెడ్గానే మెటా ఏఐ ఇంటిగ్రేషన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. రాబోయే నెలల్లో మరింత మంది యూజర్లకు ఈ ఏఐ ఫీచర్ అందించబోతోంది మెటా. వాట్సాప్ మాత్రమే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే యాప్‌లోని డైరెక్ట్ మెసేజ్ సెక్షన్‌లో కూడా యాక్సెస్ చేయొచ్చు.