Suma Kanakala: నన్ను క్షమించండి.. మీడియానుద్దేశించి యాంకర్ సుమ వీడియో పోస్ట్

హైదరాబాద్: ప్రముఖ యాంకర్ సుమ కనకాల మీడియాను క్షమాపణలు కోరారు. ఓ ఈవెంట్ లో తన మాటల వల్ల మీడియా మిత్రులు హర్ట్ అయ్యారని.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నానని ఓ వీడియోను పోస్ట్ చేసింది.

 ‘‘మీడియా మిత్రులకు నమస్కారం.. ఇవాళ (అక్టోబర్ 25)  ఓ ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని అర్థమవుతోంది.. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా.. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు.. మీరు, నేను కలిసి కొన్నేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం.. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’’ అని యాంకర్ సుమా అన్నారు. 

ALSO READ :-ద్వారక ఆలయంలో ముఖేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు