ఐఫోన్ 16 ఇంత తక్కువకా..? ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో చేతిలోకి ఫోన్..!

క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో (Zepto) ఎలక్ట్రానిక్స్పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. 30 వేల రూపాయలకు పైగా ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై రూ.10 వేల తక్షణ డిస్కౌంట్ ఇచ్చింది. ఈ కారణంగా 79,900 రూపాయల విలువైన ఐఫోన్ 16 కేవలం 70 వేల రూపాయలకే జెప్టోలో ఆర్డర్ చేసే అవకాశం వచ్చింది. 

అంతేకాదు.. కేవలం 10 నిమిషాల్లో ఈ డిస్కౌంటెడ్ ఐఫోన్ 16 మీ చేతుల్లో ఉంటుంది. ఎస్బీఐ క్యా్ష్బ్యాక్ కార్డ్ వాడి మరో 5 శాతం తగ్గించుకోవచ్చని ‘ఎక్స్’లో ఒక యూజర్ పోస్ట్ చేశాడు. ఇలా అప్లై  చేయడం వల్ల 10027 రూపాయలు అదనంగా తగ్గిందని, ఐఫోన్ 16  రూ.66,000కే పొందే ఛాన్స్ ఉందని సదరు ఎక్స్ యూజర్ స్క్రీన్షాట్తో సహా పోస్ట్ చేశాడు.

ALSO READ | ఇండియాలో 5G సొల్యూషన్‌ కోసం : చేతులు కలపనున్న ఎయిర్‌టెల్, నోకియా!

ఐఫోన్ 16 (128జీబీ) వేరియంట్ మోడల్ యాపిల్ సంస్థ అధికారిక వెబ్సైట్లో కూడా79,900 రూపాయలే ఉంది. ఐఫోన్ 16లో కొత్తగా ప్రవేశపెట్టిన యాపిల్ ఇంటెలిజెన్స్లో అనేక ఫీచర్లు ఉండటంతో ఈ మొబైల్ను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా యాపిల్ కూడా ఫోన్ డిస్ ప్లే సైజులు పెంచడం, సిరి కమాండ్ను మరింత డెవలప్ చేయడంతో క్రేజ్ బాగా పెరిగింది.

ఐఫోన్‌ 16
ధర:  రూ.79,900
స్టోరేజీ: 128 జీబీ నుంచి 512 జీబీ వరకు
డిస్‌ప్లే:  6.1 అంగుళాల పొడవు
స్పెషాలిటీ: వెనిలా వేరియంట్‌
2000 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు
ఐవోఎస్‌ 18తో ఇది పనిచేస్తుంది
128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ..
అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ కలర్స్ లో అందుబాటు