కొత్త రకం వంటకం... సోషల్ మీడియాలో వైరల్

వంటకాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలు చేస్తూ కొందరు, చేసే వంటనే తమదైన స్టైల్‌లో అందరినీ ఆకర్షిస్తూ మరికొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఓ మహిళ  కాజు కట్లీ బ‌జ్జీలంటూ  చేసిన వీడియోను  చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

వంటకాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలు చేస్తూ కొందరు, చేసే వంటనే తమదైన స్టైల్‌లో అందరినీ ఆకర్షిస్తూ మరికొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఓ మహిళ కాజీ కట్లీ బజ్జీలు వేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారు  కామెంట్లు చేస్తున్నారు.

ఇంట‌ర్‌నెట్‌లో చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేష‌న్స్ నెటిజ‌న్లకు చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్ని ఫుడ్ కాంబోల‌పై యూజ‌ర్లు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. మ‌నం ఊహించ‌ని స్నాక్స్‌, వెరైటీ ఫుడ్ కాంబోల‌తో కూడిన వీడియోలు నెట్టింట వైర‌ల‌వుతుంటాయి. ఇప్పుడు కాజు కట్లీ బ‌జ్జీలంటూ మ‌రో వైర‌ల్ వీడియో ఇంట‌ర్‌నెట్‌లో సంద‌డి చేస్తోంది. 

ALSO READ :- Rohan Roy Remuneration: రోహన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో ప్రాజెక్టుకి లక్షల్లో!

ఈ వీడియోలో ఓ మ‌హిళ కాజు క‌ట్లీ బ‌జ్జీల‌ను త‌యారుచేయ‌డం క‌నిపిస్తూ ఉంది. మహమ్మద్ ఫ్యూచ‌ర్‌వాలా అనే యూజ‌ర్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో మ‌హిళ శ‌న‌గ‌పిండితో చేసిన పేస్ట్‌తో నిల్చుని ఉండ‌టం చూడొచ్చు. ఆపై ఓ బాక్స్‌లో ఉన్న కాజు క‌ట్లీల‌ను తీసుకుని సిద్ధం చేసిన పిండిలో ముంచి నూనెలో వేయించ‌డం క‌నిపిస్తుంది.కాజు క‌ట్లీ బజ్జీల కోసం ఎవ‌రైనా అని ఈ క్లిప్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై కామెంట్స్ సెక్షన్‌లో ప‌లువురు నెటిజ‌న్లు రియాక్టయ్యారు. టేస్టీ క‌ట్లీని ఎలా వేస్ట్ చేశార‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశారు.