పేదల పెన్నిధి కాకా.. కరీంనగర్ జిల్లాలో అధికారికంగా జయంతి

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారికంగా జయంతి 
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, నాయకులు 
  • పూలమాలలు వేసి ఘన నివాళి  

దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి  కాకా వెంకట స్వామి జయంతి ఘనంగా జరుపుకున్నారు.  పేదల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని ప్రజాప్రతినిధులు, పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను  కాంగ్రెస్ సర్కారు అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో  కాకా ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రైవేటు రంగంలో పెన్షన్ ప్రవేశపెట్టి పేదల పక్షాన నిలిచిన మహానేత అని కొనియాడారు.  వెలుగు, నెట్ వర్క్