సిద్ధులగుట్టపై పూజలు, అన్నదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో పురోహితులు కుమార్ శర్మ, నందీశ్వర మహరాజ్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి, మున్సిపల్​చైర్ పర్సన్ పండిత్ వినీత హాజరయ్యారు.

రామాలయం నుంచి జీవకోనేరు వరకు ఉత్సవమూర్తులతో పల్లకీసేవ జరిగింది. వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.