కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ 

కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులుదీరారు. రెండో శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ సునీల్, చందు ఏర్పాట్లను పర్యవేక్షించారు.