జమ్మూ కశ్మీర్‌లోని రియాసి (Reasi) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి (Mata Vaishno Devi) వెళ్లే యాత్ర మార్గంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు.
జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం రహదారిపై రాయి పడి కొండచరియలు విరిగిపడిన సంఘటన జరిగిందని శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు సీఈఓ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా.. కొండచరియలు విరిగిపడటంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు.. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. భక్తులందరూ కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి దూరంగా ఉండాలని, నిర్వాహకుల సూచనలను పాటించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ALSO READ | వయనాడ్లో టూరిజాన్నిపునరుద్ధరించాలి: ఎంపీ రాహుల్ గాంధీ
పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ఘటన నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు.