పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోండి .. చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను అడ్డుకుంటున్న భూ నిర్వాసితులు

మహదేవపూర్, వెలుగు :  భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎల్కేశ్వరంలో నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను భూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. తమ భూములకు ముందుగా విలువ కట్టి డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని కోరుతున్నారు. పనులను అడ్డుకునేందుకు ఆత్మహత్యాయత్నాలకు  దిగుతున్నారు.  అయినా.. ఆఫీసర్లు పనులను కొనసాగిస్తూనే ఉన్నారు.  

మంగళవారం రాళ్లబండి రజిత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఆమె భర్త మల్లయ్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. వెంటనే బంధువులు108లో మహదేవపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.