ఎమ్మెల్యే సహకారంతో భూకబ్జాలు

జమ్మికుంట, వెలుగు: ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి సహకారంతో ఆయన అనుచరులు జమ్మికుంట పట్టణంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు పొన్నగంటి మల్లయ్య, దేశిని కోటి ఆరోపించారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని మల్లయ్య నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డులో ఉన్న మహిళ సంఘ భవన స్థలాన్ని అక్రమంగా ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారన్నారు. 

అధికార బలంతో సర్వే నం652 లో భవనాన్ని కట్టాల్సిన  కబ్జాదారులు  648 లో కట్టి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆనాడు ఎమ్మెల్సీగా.. నేడు ఎమ్మెల్యే గా కౌశిక్ రెడ్డి ఆగడాలు అవినీతిని చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశంలో బొంగోని వీరన్న, రవి, భిక్షపతి, రాజు, రాము, సారంగపాణి, మొగిలి పాల్గొన్నారు.