సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మీనారాయణ 

  •     వైస్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా అడ్డగట్ల మురళి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. చైర్మన్‌‌‌‌‌‌‌‌ ర్యాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా అడ్డగట్ల మురళి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అర్బన్ బ్యాంక్  ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానెల్ నుంచి 8 మంది డైరెక్టర్లు  గెలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్యానెల్ నుంచి డైరెక్టర్ గా గెలిచిన పత్తిపాక సురేశ్‌‌‌‌‌‌‌‌  చైర్మన్ పదవి కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.  డీసీవో బుద్ధనాయుడు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.