హిమచల్‌‌‌‌‌‌‌‌లో మౌంటెన్‌‌‌‌‌‌‌‌ను అధిరోహించిన అన్నాచెల్లెలు

రాయికల్, వెలుగు : హిమాచల్‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌ మనాలీలోని మౌంటెన్‌‌‌‌‌‌‌‌(14,600ఫీట్లు)ను రాయికల్‌‌‌‌‌‌‌‌ మండలం ఆలూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అన్నాచెల్లెలు లక్కం మణిరాజ్‌‌‌‌‌‌‌‌, లక్కం రషిత అధిరోహించారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7న పర్వతారోహణ చేసిన బృందంలో వీరిద్దరూ ఉన్నారు. కోచ్‌‌‌‌‌‌‌‌ దీకొండ శివరామకృష్ణ ఆధ్వర్యంలో వీరు శిక్షణ పొందారు. 

కరీంనగర్​లోని శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్నారు. బుధవారం అన్నాచెల్లెలను శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాంరెడ్డి,  గ్రామస్తులు భాస్కర్ రావు, సురేందర్ రెడ్డి ప్రశంసించారు.