లగచర్ల దాడి కేసు స్పీడప్

  • పరిగి డీఎస్పీ ఆఫీసుకు అదనంగా మరో డీఎస్పీ అటాచ్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీ ఆఫీసుకు అదనంగా మరో డీఎస్పీని అటాచ్ చేసింది. పరిగి సీఐగా మొన్నటి వరకు విధులు నిర్వహించి డీఎస్పీగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ కు లగచర్ల కేసు అదనపు బాధ్యతలుగా అప్పగించింది. లగచర్ల దాడి ఘటన ఎంక్వైరీ స్పీడప్ చేసేందుకు అదనపు డీఎస్పీగా శ్రీనివాస్ ను నియామించిందని అధికారులు తెలిపారు. పరిగి డీఎస్పీ ఆఫీసులో అదనపు డీఎస్పీగా శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.