రాజన్న, కొండగట్టు ఆలయాల్లో మహిళా అఘోరి పూజలు

వేములవాడ/కొండగట్టు, వెలుగు : వేములవాడ రాజన్న, కొండగట్టు ఆలయాలను బుధవారం మహిళ అఘోరి దర్శించుకున్నారు. వేములవాడలో దర్శనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయంలోని దర్గాను తీసివేయాలని, అప్పుడే హిందూ సమాజం బాగుపడుతుందన్నారు.

దర్గా తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం జరగబోతుందో చూడాలంటూ తన వాహనంలో వెళ్లిపోయారు. అంతకుముందు కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరీ పూజలు చేశారు.