మెల్‌బోర్న్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టు హోరాహోరీగా సాగుతోంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ల పోరాటంతో కష్టాల నుంచి గట్టెక్కిన టీమిండియా.. మ్యాచ్‌పై పట్టుబించే ప్రయత్నం చేస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసి.. ఆ లక్ష్యాన్ని చేధించాలనేదే భారత్ వ్యూహం. కానీ, ఆసీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(65*) ఆ వ్యూహానికి అడ్డుపడుతున్నాడు. తన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
సిరాజ్ జోరు.. బుమ్రా మాయాజాలం
నాలుగో రోజు ఆటలో నిలకడగా ఆడుతోన్న ఆసీస్‌ను మహ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓ సూపర్ డెలివరీతో ఉస్మాన్ ఖవాజా (21)ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్.. అదే ఊపులో 80 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్(13)ను వెనక్కి పంపాడు. అక్కడినుండి ఆసీస్ కేవలం 11 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. బుమ్రా మాయాజాలంతో నిమిషాల వ్యవధిలోనే ట్రావిస్ హెడ్(1), మిచెల్ మార్ష్(0), అలెక్స్ క్యారీ(2)లను పెవిలియన్ చేరారు. దాంతో, మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగించినట్లు కనిపించింది.
అడ్డుపడుతోన్న లబుషేన్
ఇక మిగిలింది ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(65*) ఒక్కడే. అతనే అడ్డుపడుతున్నాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (21)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జైస్వాల్ చేజార్చడం, అంపైర్స్ కాల్‌తో ఎల్బీ నుంచి బయటపడటం వంటివి ఆసీస్‌కు అనుకూలంగా మారుతున్నాయి.
What a session!
— ESPNcricinfo (@ESPNcricinfo) December 29, 2024
Bumrah ripped into Australia, but Marnus and Cummins have seized back the initiative ?
? https://t.co/ycgxNhumqw | #AUSvIND pic.twitter.com/u43CJ2XaoE
ప్రస్తుతం ఆసీస్ స్కోర్.. 49 ఓవర్లు ముగిసేసరికి 135/6. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుంటే 240 పరుగుల లీడ్‌లో ఉంది.
9 పరుగులు మాత్రమే..
అంతుకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. నాలుగోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. మునుపటి రోజు స్కోరుకు కేవలం 9 పరుగులు మాత్రమే జోడించారు. సెంచరీ హీరో నితీశ్ రెడ్డి (114) లియోన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగుల ఆధిక్యం లభించింది.