అమెరికాలో భారత్​ నూతన రాయబారి క్వాత్రా

అమెరికాలో భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్​ క్వాత్రా బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆయన భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేసిన తరణ్​జీత్​ సింగ్​ సంధు స్థానంలో వినయ్​ మోహన్​ బాధ్యతలు చేపట్టనున్నారు. తరణ్​జీత్​ సింగ్​ సంధు అమెరికా రాయబారిగా 2020 నుంచి 2024 వరకు ఉన్నారు. 

1988 బ్యాచ్​కు చెందిన ఇండియన్​ ఫారెన్​ సర్వీసెస్​ అధికారి క్వాత్రా ఫ్రాన్స్, నేపాల్​లోనూ భారత్​ రాయబారిగా ఉన్నారు. ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.