కురుమూర్తి కిటకిట

ఉద్దాల ఉత్సవం సందర్భంగా మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే ఉద్దాల ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు బస్సులు, ప్రైవేట్​ వాహనాల్లో క్షేత్రానికి చేరుకున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. 

స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దాసంగాల కోసం కొత్త కుండలను కొనుగోలు చేసి అన్నం, పచ్చిపులుసు వండారు. స్వామికి నైవేద్యంగా సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. అనంతరం స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా జాతర మైదానంలో స్వీట్లు, చిన్న పిల్లల ఆట వస్తువులు, ఇతర దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఉద్దాలను దర్శించుకొని భక్తిపరవశులయ్యారు. వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్​నగర్​