కుమ్రం భీంకు ఘన నివాళి

కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఆదివాసీలను చైతన్యం చేసిన గొప్ప యోధుడు కుమ్రం భీం అని పలువురు కొనియాడారు. మంగళవారం కుమురంభీం జయంతి సందర్భంగా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో లంబాడీల జేఏసీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

లంబాడీల జేఏసీ స్టేట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నరేశ్, జిల్లా మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఆ పార్టీ లీడర చీటి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌రావు కుమ్రంభీం ఫొటో వద్ద నివాళులర్పించారు. సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి,సెస్ డైరెక్టర్ కృష్ణహరి, లీడర్లు సుభాశ్‌‌‌‌‌‌‌‌, బాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నర్సాగౌడ్, జబ్బర్ పాల్గొన్నారు.