యాదాద్రి, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసిందన్నారు. కొన్ని రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఆయన తెలిపారు.
నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్- , ఖమ్మం-- , నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా కృషి చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల తో తీన్మార్ మల్లన్నను గెలిపించుకునే బాధ్యత మనదేనని అన్నారు.
ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓటున్న ప్రతి గ్రాడ్యుయేట్ వద్దకు వెళ్లి మన అభ్యర్థికి ఓటు వేసే విధంగా చూడాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య , ఎంపీపీ మనిమద్దె సుమన్, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.