నా మీద కోపంతో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వలె : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • చీరల పంపిణీలో స్కాం జరిగిందని సీఎం రేవంత్ పిచ్చోడిలా మాట్లాడిండు: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కాంగ్రెస్ వచ్చాక మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపణ

రాజన్న సిరిసిల్ల, వెలుగు: తన మీద కోపంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లకు బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ పెట్టిందని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాక ముందు సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలుండేవని, వాటిని నివారించడానికి బతుకమ్మ చీరల పేరిట కేసీఆర్ ఓ పథకం తెచ్చారన్నారు. దీంతో నేత కార్మికులకు పని కల్పించి ఆత్మహత్యలను ఆపగలిగామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఆత్మహత్యలు పెరిగాయన్నారు.

గురువారం సిరిసిల్ల జిల్లా బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం కొదురుపాకలో తన తాత అమమ్మల పేరిట రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. అనంతరం ఆయన సిరిసిల్లలో ప్రెస్ కాన్ఫ్‌‌‌‌‌‌‌‌రెన్స్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగినట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడిలా అబద్ధాలు మాట్లాడారని, ఒకవేళ కుంభకోణం జరిగితే ఎంక్వైరీ చేసుకోవాలని సవాల్ చేశానని గుర్తుచేశారు.

సూరత్ నుంచి చీరలు తెచ్చి కుంభకోణం చేశారని ఆరోపించారని, మొదటి ఏడాది మాత్రమే కొన్ని చీరలు తెప్పించామన్నారు. మరోవైపు, రాష్ట్రంలో కొంత మంది ఆఫీసర్లు హద్దుమీరి కాంగ్రెస్ నాయకుల్లా ప్రవవర్తిసున్నారని కేటీఆర్ మండిపడ్డారు. చట్ట ప్రకారం అధికారులు పని చేయాలని, లేకపోతే నాలుగేండ్ల తర్వాత కేసీఆరే సీఎం అవుతారని, అప్పుడు ఆఫీసర్ల సంగతి చూస్తామని హెచ్చరించారు.  

హైడ్రా పేరుతో పేదల ఉసురు తీయొద్దు

హైడ్రా పేరుతో పేదల ఉసురు తీయొద్దని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. సీఎం అన్నదమ్ముల అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కట్టిన 40 వేల ఇండ్లు రెడీగా ఉన్నాయని, వాటిని పేదలకు పంచాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సీఎం అన్నకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయం ఉండొద్దన్నారు. పేద ప్రజలు ఎక్కడ కూడా నాలాల మీద ఇండ్లు కట్టుకోలేదని, మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రాంచందర్ రావు లాంటోళ్లు రూ.వేల కోట్లు పెట్టి ఫాం హౌస్‌‌‌‌‌‌‌‌లు కట్టుకున్నారని, వాటిని కూల్చాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ములకు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ పేరిట వేల కోట్లు అప్పజెప్తున్నారని ఆరోపించారు. అర్హతలేని ఆయన బావమ్మర్దికి రూ.1,137 కోట్ల కాంట్రాక్ట్ పనులు అప్పజెప్పారన్నారు.