అర్బన్ బ్యాంక్​ను అగ్రస్థానంలో నిలిపాలి : కేటీఆర్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్​ను స్టేట్​లో నంబర్ వన్ ప్లేస్ నిలపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన బ్యాంక్ పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. బీఆర్​ఎస్ అధికారంలో లేకున్నా అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం తీసుకోవాలని సూచించారు.

అంతకుముందు ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందమ్ కళ, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, నేతలు ప్రవీణ్, రామ్మోహన్ , నూతన పాలకవర్గంతో పాటు బ్యాంకు వినియోగదారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.