ఎవరు భయపడొద్దు.. ప్రతి ఒక్కరి లెక్క తేలుద్దాం: కేటీఆర్

బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి లెక్క తేలుద్దామని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తల్లి నరసమ్మ మృతి చెందడంతో గంగులను ఇవాళ కేటీఆర్ పరామర్శించారు. గంగుల తల్లి నరసమ్మ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు.  అనంతరం కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు.

ALSO READ | జైలుకెళ్లడం ఖాయం.. గాదరి కిశోర్‎కు ఎమ్మెల్యే సామేల్ వార్నింగ్

ఈ సందర్భంగా "తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారంటూ" కొందరు కార్పొరేటర్లు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అందరి పేర్లు రాసి పెట్టుకోవాలని, మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళ లెక్క తేలుద్దామని కేటీఆర్ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పారు. ఇదే విషయం తాను ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్నతో కూడా చెప్పానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుద్దామన్నారు.