జీపీ కార్మికుల నిరసన

కోటగిరి, వెలుగు:  నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని కోటగిరి జీపీ కార్మికులు గురువారం ఎంపీడీఓ ఆఫీస్‌‌ ‌‌   ఎదుట ఎంపీడీఓ చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీపీ కార్మికులు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడంతో కుటుంబం గడవటం కష్టంగా ఉందని వెంటనే తమ జీతాలు వెంటనే  ఇవ్వాలని డిమాండ్ చేవారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీస్ గేటు ముందు బైఠాయించి గంట పాటు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నన్నెసాబ్, జీపీ కార్మికులు పోశెట్టి, బ్రహ్మం, తదితరులున్నారు.