కోరుట్ల అగ్రికల్చర్​ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలి : స్టూడెంట్స్​ పేరెంట్స్

కోరుట్ల, వెలుగు:  కోరుట్లలోని సోషల్​ వెల్ఫేర్​ మహిళా రెసిడెన్షియల్​ అగ్రికల్చర్ కాలేజీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్స్​ పేరెంట్స్​ కమిటీ సభ్యులు విన్నవించారు. శనివారం హైదరాబాద్​ లోని సచివాలయంలో మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ లను పేరెంట్స్​ కమిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ల తల్లిదండ్రులు కలిసి వినతి పత్రం అందజేశారు. కోరుట్ల అగ్రికల్చర్​ కాలేజీలో  రెండు సంవత్సరాల నుంచి సరైన సౌకర్యాలు లేవని, పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేదన్నారు. ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌ కోసం సరైన ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, వ్యవసాయ భూమి లేదన్నారు.​​

కాలేజీ ప్రభుత్వ గుర్తింపులో కూడా లేనందున ఐకార్​ సర్టిఫికేట్​ వస్తుందో లేదోనని ఆందోళనలో స్టూడెంట్స్​ ఉన్నారని తెలిపారు.  మొదటి సంవత్సరం అడ్మిషన్​ నోటిఫికేషన్ ఇప్పటికి​ ఇవ్వలేదన్నారు. సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి , ప్రిన్సిపల్​ సెక్రటరీ శాంతికుమారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రంలో  పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో పేరెంట్స్​ కమిటీ సభ్యులు నర్సయ్య, సత్యం, నాగభూషణం,సాయికుమార్​, జ్యోతి, కాశయ్య తదితరులున్నారు.