ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్​ పోటీలు

సూర్యాపేట, వెలుగు : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్​క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని పీసీసీ సభ్యుడు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పిల్లలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఫొటో, లోగోతో కూడిన టీషర్ట్స్ ఆయన అందజేశారు. 

ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేయబోతున్నారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.