అంజన్న ఆదాయం రూ. 1.04 కోట్లు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 75 రోజులకు సంబంధించి 12 హుండీలను లెక్కించగా మొత్తం రూ. 1,04,36,365 వచ్చాయి. అలాగే 60 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల మిశ్రమ వెండి, 78 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. లెక్కింపులో అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రియ, ఈవో రామకృష్ణారావు, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్‌ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్‌ పాల్గొన్నారు.