ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలి : కొమ్మెర రవీందర్ రెడ్డి

గన్నేరువరం, వెలుగు : కరీంనగర్ నుంచి గుండ్లపల్లి, మాదాపూర్ మీదుగా గన్నేరువరం వరకు ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ను కోరారు. ఆదివారం కరీంనగర్‌‌‌‌లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరుకాగా వారికి వినతిపత్రం అందజేశారు.

బస్సు లేకపోవడంతో గన్నేరువరం మండల కేంద్రం వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి త్వరలోనే బస్సును ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన రవీందర్‌‌‌‌రెడ్డి  తెలిపారు.