వీడికి బలుపు తగ్గలేదు : జైల్లో ఎగ్ కర్రీ కోసం కోల్ కతా రేపిస్ట్ గొడవ

దేశం మొత్తం వీడిని ఉరి తీయాలి.. కాల్చి చంపాలి అని డిమాండ్ చేస్తుంటే.. వాడు మాత్రం హాయిగా జైల్లో ఉండి.. నాకు అది కావాలి.. ఇది కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నాడు.. పెట్టింది తినకుండా.. నాకు ఆ కర్రీ కావాలి.. నాకు బిర్యానీ కావాలి అంటూ జైల్లో గొడవ చేస్తున్నాడు కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ను రేప్ చేసి చంపేసిన రేపిస్ట్ సంజయ్ రాయ్..

 నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో ఉన్నాడు. అయితే  జైల్లో నిబంధనల ప్రకారం ఖైదీలందరికీ ఒకే రకమైన కర్రీ పెడతారు. డైలీ ఒకే రకమైన వెజ్ టేబుల్ కర్రీ..రోటీ పెడుతున్నారని  సంజయ్ రాయ్ గొడవ చేస్తున్నాడని జైల్ అధికారులు వెల్లడించారు. తనకు సాధారణ భోజనం కాకుండా ఎగ్ కర్రీ డిమాండ్ చేస్తున్నాడంట. అయితే చివరకు జైలు అధికారులు సీరియస్ కావడంతో  సంజయ్ రాయ్  సాధారణ వెజ్ కర్రీ తినేందుకు అంగీకరించాడంట.

ALSO READ | ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం సహించదు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  ఆగస్టు 9న  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటికే ఆర్జీ కర్ కాలేజ్ మాజీప్రిన్సిపాల్ సందీప్ ఘోష్  ను (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సందీప్ ఘోష్ ను ఆగస్టు 30న మరోసారి సీబీఐ విచారించింది. ఘోష్ ఇంట్లో సోదాలు కూడా చేసింది సీబీఐ.