చాలామంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పుడు వందేభారత్ ట్రైన్స్‌లో ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రైన్ లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా సయం కూడా ఆదా అవుతుంది. అయితే కోల్‌కతాకు చెందిన ఓ మహిళ వందేభారత్‌లో మొదటి సారిగా ప్రయాణించింది. అయితే ఆమె తన జర్నీ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, టాయ్‌లెట్స్ సూపర్ గా ఉన్నాయంటూ.. ఫుడ్ మాత్రం బాగాలేదంటూ చెప్పుకొచ్చింది.
కిటికీ షీల్డ్‌ల గురించి ప్రారంభించిన కథనాన్ని @epicnephrin_e అనే వినియోగదారు పేరుతో పిలువబడే ప్రయాణికురాలు ప్రారంభించింది. వందేభారత్ ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఆమె తన ముఖాన్ని డెనిమ్ జాకెట్‌తో కప్పుకోవాలని తెలిపింది. ఇక ఆహారం ( స్నాక్స్)విషయంలో శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తూ ధర సమానంగానే ఉన్నా.. క్వాలిటీ విషయంలో మాత్రం వందేభారత్ ట్రైన్ లో బాగాలేదని తెలిపింది. . మధ్యాహ్న భోజనం బాగానే ఉన్నప్పటికి ... వెచ్చదనం.. తాజా ఫుడ్ విషయంలో ప్రశంసించింది.
వాష్ రూముల గురించి రాస్తూ.. ఆటోమేటిక్ డోర్లు.. లోపల చాలా క్లీన్ గా ఉందని తెలిపింది. వందేభారత్ ట్రైన్ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని కోల్‌కతా మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు రైలులోని లోపాల గురించి రాశారు. ఓవర్ హెడ్ లగేజ్ షెల్ఫ్ చాలా అధ్వాన్నంగా ఉందని ఒకరు రాయగా... మరొకరు బ్యాగులు కిందపడకుండా ఉండేందుకు తగినంత వాలు లేదని కామెంట్ చేశారు. మూడవ వారు ఫుడ్చాలా దయనీయంగా ఉందని రాశారు, ఇంకా రైలు వేగం పెరిగే కొద్దీ.. ఏసీ సరిగా పని చేయదని.. ఓవర్ హెడ్ లగేజీ కారణంగా విండో సీట్లకు చల్లని గాలి అందదని ఇంకొకరు రాశారు.