మహిళల రక్షణకు కొత్త చట్టం: అపరాజితపై గవర్నర్ తక్షణమే సంతకం చేయాలి: మమతా బెనర్జీ

మహిళా శిశు రక్షణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది. మంగళవారం (సెప్టెంబర్ 3) న అపరాజిత పేరుతో మహిళా శిశు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్  చట్టాల సవరణ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక మిగిలింది గవర్నర్ సంతకమే. తక్షణమే అపరాజిత బిల్లుపై సంతకం చేయాలని గవర్నర్ ఆనంద బోస్ ను సీఎం మమతా బెనర్జీ కోరారు. మహిళలు, చైల్డ్ రక్షణకోసం త్వరిత విచారణ,వేగవంతమైన న్యాయం, దోషులకు కఠిన శిక్ష విధించడం లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. 

ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న జరుగుతున్న మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నక్రమంలో బెంగాల్ అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.