కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసు.. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే జూడా మర్డర్ కేసును సీబీఐ విచారిస్తోంది. 



జుడా మర్డర్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియందగ్గర ఆందోళకారులు భారీ నిరసనకు దిగారు. కేసు విచారణను తర్వగా పూర్తి చేయాలని.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.