నిరసన విరమించిన కోల్‌‌కతా డాక్టర్లు

  •    ఎమర్జెన్సీ సేవలందిస్తామని ప్రకటన

కోల్‌‌కతా : కోల్‌‌కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన మెడికల్ స్టూడెంట్స్ ఎట్టకేలకు ఆందోళన విరమించారు. శనివారం నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. అయితే, తమ భద్రతపై బెంగాల్‌‌ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చాకే  ఔట్ పేషెంట్ విభాగం(ఓపీడీ)లో సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. 

డాక్టర్ల తాజా నిర్ణయంతో 41 రోజుల సుదీర్ఘ నిరసనకు తెరపడినట్లయ్యింది. మూడు రోజుల క్రితం సీఎం మమతా బెనర్జీతో ఆమె నివాసంలో జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి పలు డిమాండ్లకు మమత అంగీకరించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయలన్ ను బదిలీ చేశారు. కొత్త కమిషనర్ గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్హె

ల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు. అనంతరం రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ తో బుధవారం సమావేశమయ్యారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లు, సూచనలను తెలియజేశారు. వాటికి మనోజ్ పంత్ అంగీకరించారు. దాంతో జూనియర్ డాక్టర్లు నిరసనను విరమిస్తున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు.