2027 వరకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీతోనే : విరాట్ కోహ్లీ

బెంగళూరు : ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ ఫ్రాంచైజీతో తప్ప మరో జట్టుకు ఆడే ఆలోచనే తనకు లేదని టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 2027 వరకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీతోనే ఉండి ఆ జట్టుతో తన 20 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటానని హింట్ ఇచ్చాడు. 2008లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంగళూరు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన విరాట్   మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 252 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  ఆడి 8005 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగా వేలానికి ముందు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్లలో కోహ్లీ ఉన్నాడు.

‘ఈ రిటెన్షన్ అంచె (మూడేండ్లు) చివరకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ జట్టుతో నా ఆటకు 20 ఏండ్లు పూర్తవుతుంది. అది నాకెంతో ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఒకే జట్టుకు ఇంతకాలం ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, ఇన్నేండ్లలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీతో నా అనుబంధం చాలా ప్రత్యేకంగా మారింది.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ తప్ప మరో జట్టులో నన్ను నేను చూడలేను. రాబోయే వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకొని జట్టును బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నా. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని ఒక్కసారైనా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజేతగా నిలపాలన్నదే మా లక్ష్యం’ అని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ బోల్డ్ డైరీస్ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ చెప్పుకొచ్చాడు.