మొరాయించిన రైల్వేగేటు..భారీగా ట్రాఫిక్ జామ్

జగిత్యాల: రైల్వేగేట్లు..వీటిని రైల్వే ట్రాక్ ఉండి జనం తిరిగే చోట్ల వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రమాదాలను జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తుంది రేల్వే శాఖ. ఈ విషయం తెలిసిందే కదా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకుంటున్నారా..రైల్వేగేటు మొరాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో గేట్లకు రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఇకచూడండి రైల్వే గేట్ల దగ్గర సిబ్బంది పాట్లు అంతాఇంతా కాదు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు నుంచి కొడిమ్యాల మండల కేంద్రానికి వెళ్లే దారిలో ఉన్న రూల్వే గేట్లు తెరుచుకోకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహ నాలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది గేట్లు తెరిచేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరికి అతికష్టం మీద గేట్లను తెరిచారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.