సింగరేణి సీఎండీకి కోదండరాం, కార్మిక సంఘాల వినతి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులకు జీవో 22 ప్రకారం జీతాలివ్వాలని ప్రొఫెసర్​ కోదండరాం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్​ కార్మికుల పరిరక్షణ సంఘం లీడర్లు శుక్రవారం సింగరేణి సీఎండీ బలరామ్​కు హైదరాబాద్​లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ వివరాలను సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ ​వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో18 రోజులు సమ్మె చేయగా జీవో 22 ప్రకారం జీతాలిస్తామని సింగరేణి యాజమాన్యం ఒప్పుకుందన్నారు. 

కానీ, అప్పటి సర్కారు నుంచి గ్రీన్​సిగ్నల్ రాకపోవడంతో ఆగిపోయిందన్నారు. వెంటనే జీవోను అమలు చేసే విధంగా ప్రభుత్వానికి లెటర్ ​రాయాలని సింగరేణి సీఎండీని కోరామన్నారు. కాంట్రాక్ట్​ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. టీజేఎస్​రాష్ట్ర లీడర్లు మల్లెల రామనాథం, యూనియన్​ఉపాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, బాషా, రవి పాల్గొన్నారు.