సూపర్ ఫుడ్ స్ట్రాబెర్రీ తింటే ఎన్నో లాభాలు..తెలుసుకుందాం రండి..

పోషణ ప్రపంచంలో రారాజు స్ట్రాబెర్రీ.. పవర్ హౌజ్గా, సూపర్ ఫుడ్గా దీనికి మంచి పేరుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్, ఆంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న మంచి రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న పండు స్ట్రాబెర్రీ. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను వృద్ధి చేస్తుంది. గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. కాంతివంతమైన చర్మాన్ని  ఇస్తుంది.

ఈ శక్తివంతమైన ఎర్రని స్ట్రాబెర్రీలు నిజంగా రుచి చూడదగిన సూపర్ ఫుడ్. దీనిని తాజాగా ఫ్రూట్ సలాడ్లతో తీసుకుంటే చాలా మంది. రుచికరమైన, పోషకాలున్న ఈ స్ట్రాబెర్రీలను భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అందుతుంది.  సో ఇంకెందుకు ఆలస్యం.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,  తీపి రుచిగల ఈ సూపర్ ఫుడ్ ని తీసుకొని ఆరోగ్యంతో పాటు టేస్టీని ఎంజాయ్ చేయండి. 

స్ట్రాబెర్రీని మీ ఆహారంలో చేర్చడంతో వచ్చే 5ఆరోగ్యకర ప్రయోజనాలు 

అంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: 

స్ట్రాబెర్రీలు ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, ఎలాజిక్ యాసిడ్ తో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి(Oxidative Stress), సెల్యూలార్ నష్టాన్ని కలిగించే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అడ్డుకుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది 

ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లలో శక్తివంతమైన సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోజువారీ ఆహారంలో ఒకసారి స్ట్రాబెర్రీని తీసుకుంటే సి విటమిన్ లోపాన్ని అధిగమిం చవచ్చు. సి విటమిన్ శరీరంలోని తెల్ల రక్త కణాలు, కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. 

స్ట్రాబెర్రీతో  గుండె ఆరోగ్యం  

స్ట్రాబెర్రీలు రోజువారీ ఆహారంతో కలిసి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే ఆంథోసైనిన్లు, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా ఆంథోసైనిన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. 

బరువు నిర్వహణకు సాయం 

స్ట్రాబెర్రీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును నిర్వహించడానికి అద్భుతమైన ఎంపిక. ఫైబర్ కంటెంట్ కేలరీలను తీసుకోవడం తగ్గిస్తుంది. బరువు నియంత్రణకు సాయపడుతుంది. 

చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది 

విటమిన్ సి, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల కలయిక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. విటమిన్ సి, ఎలాజిక్ యాసిడ్ లు స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి కీలకం. ఇది చర్మం పాడైతే రికవరీకి దోహదం చేస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. ఎల్లాజిక్ యాసిడ్ అల్ట్రా వాయిలెట్ రేడియేషన్ హానికరమైన ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం దెబ్బతినకుండా , అకాల వృద్యాప్యాన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.