World Hepatitis Day 2024: హెపటైటిస్ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వైరల్ హెపటైటిస్ అనేది లివర్ ను ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్స్ సమూహం అన్ని చెప్పచ్చు. ఇది వివిధ వైరస్ల వల్ల వస్తుంది,హెపటైటిస్  లో వివిధ స్టేజెస్ ని బట్టి తీవ్రతను గుర్తిస్తారు.  దీనిని చికిత్స లేకుండా వదిలేస్తే దీర్ఘకాలిక లివర్ వ్యాధి, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.

హెపటైటిస్ లక్షణాలు:

కామెర్లు: హెపటైటిస్ యొక్క ముఖ్య లక్షణాలలో కామెర్లు ఒకటి... 

అలసట: హెపటైటిస్ ఉన్న చాలా మందిలో విపరీతమైన అలసట మరియు నీరసం కనిపిస్తుంది.

కడుపు నొప్పి: పొత్తికడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది.

వికారం మరియు వాంతులు: హెపటైటిస్ ఉన్నవారిలో తరచుగా వికారం మరియు వాంతులు సహా జీర్ణ సమస్యలు కనిపిస్తాయి.

ఆకలి తగ్గడం:హెపటైటిస్ ఉన్న వారిలో మరో ప్రధాన లక్షణం ఆకలి మందగించడం. దీనివల్ల బరువు తగ్గుతారు.

ముదురు రంగులో మూత్రం: మూత్రం ముదురు రంగులోకి మారవచ్చు, కొన్నిసార్లు బిలిరుబిన్ ఉనికి కారణంగా "కోలా-రంగు"లోకి కూడా మారుతుంది.

కండరాలు మరియు కీళ్ల నొప్పులు: హెపటైటిస్‌తో బాధపడుతున్నవారిలో  కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పులను అనుభవిస్తారు.

జ్వరం: హెపటైటిస్ ఉన్నవారిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతే, తరచూ చలి, జ్వరం వస్తుంది.

ఫ్లూ లాంటి లక్షణాలు: హెపటైటిస్ లక్షణాలు కొన్నిసార్లు జ్వరం, అలసట మరియు ఒళ్లునొప్పులతో పాటు ఫ్లూ కూడా కనిపిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

వ్యాక్సినేషన్: హెపటైటిస్ A మరియు B వ్యాక్సిన్‌లు ఈ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అధిక-ప్రమాదం ఉన్న వ్యక్తులకు టీకాలు వేయడం ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది.

హైజీన్: పారిశుధ్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు వాటర్ విషయంలో జాగరత్తలు పాటించాలి. పచ్చి లేదా తక్కువ ఉడికించిన సీఫుడ్ మరియు షెల్ఫిష్‌లను తీసుకోకుండా ఉండటం మంచిది.

స్క్రీనింగ్ మరియు టెస్టింగ్: రెగ్యులర్ స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ ఇన్ఫెక్షన్‌లను ముందుగానే గుర్తించగలవు, ఇది సకాలంలో చికిత్స తీసుకోవడానికి తోడ్పడుతుంది.

మద్యపానం తగ్గించాలి: హెపటైటిస్, లివర్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మద్యపానం తగ్గించాలి.