ఎక్కడైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తా..తుది జట్టులో చోటు ఉంటే చాలు-కేఎల్ రాహుల్

అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : జట్టు కోసం ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. బ్యాటింగ్ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్పు విషయంలో ఎదురయ్యే మానసిక సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నుంచి తాను బయటపడ్డానని  తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ  గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చాడు. శుక్రవారం నుంచి అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే పింక్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులో రోహిత్ తుది జట్టులోకి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ బ్యాటింగ్ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చ మొదలైంది. 

బుధవారం జరిగిన మీడియా సమావేశంలో  ఈ విషయంపై ఎదురైన ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇచ్చాడు. ‘ఏ స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయమన్నా నాకు ఓకే.  తుది జట్టులో ఉండటమే ముఖ్యం. టీమ్ కోసం ఎక్కడైనా ఆడాలి. నేను చాలా స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. ఈ విషయంలో ఇదివరకు  కాస్త ఇబ్బంది పడ్డా. అది టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాదు. మొదటి 20–25 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ఆడాలనే దానిపై మానసికంగా సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదురయ్యేది. ఎప్పుడు ఎటాక్ చేయాలి? ఎంత అప్రమత్తంగా ఉండాలి? అనే ప్రశ్నలు వచ్చేవి. 

ఇప్పుడు టెస్టులు, వన్డేల్లో పలు స్థానాల్లో ఆడటంతో నా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో  స్పష్టత వచ్చింది. టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చినా.. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడినా ఆరంభంలో 30–40 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగలిగితే ఇక అంతా సాధారణంగా మారిపోతుంది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. 

ఇక పదేండ్ల కిందట ఆస్ట్రేలియాలోనే తన టెస్టు కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైందని రాహుల్ గుర్తు చేసుకున్నాడు.  ఎన్నో ఎత్తుపల్లాలు, గాయాలు, ఆటకు దూరమైన సమయాలను చూసుకుంటే  ఈ దశాబ్ద ప్రయాణం తనకు 25 ఏండ్ల అనుభవాలను ఇచ్చిందని రాహుల్ తెలిపాడు.